Advertisementt

సహజీవనంపై నిత్యా అభిప్రాయం!

Tue 21st Apr 2015 12:05 AM
nithya menen,live in relation,ok bangaram,nithya menen about live in relation  సహజీవనంపై నిత్యా అభిప్రాయం!
సహజీవనంపై నిత్యా అభిప్రాయం!
Advertisement
Ads by CJ

నిత్యామీనన్‌ హీరోయిన్‌గా ఇటీవల ‘ఓకే బంగారం’ చిత్రం విడుదలై మంచి విజయం దిశగా అడుగులేస్తోంది. సహజీవనం నేపథ్యంలో సాగే చిత్రమిది. పెళ్లికాకముందే ఓ జంట కలిసి ఉండడం, శరీరాల్ని సైతం పంచుకోవడం, ఆ తరువాత ప్రేమ మొదలుకావడం... ఇలా ఈ చిత్రం సాగుతుంది. మరి మీ దృష్టిలో సహజీవనం తప్పా? కరెక్టా? అని నిత్యామీనన్‌ను అడిగితే నిత్యా కూడా కూల్‌గా సమాధానం ఇచ్చింది. ఈరోజుల్లో ఇది తప్పు.. ఇది కరెక్ట్‌ అని చెప్పడానికి మనం ఎవరం...? ఇది వరకు పెళ్లిపీటల మీద గానీ తన భర్తను చూసే అవకాశం ఉండేది కాదు... ఆ తర్వాత ఐదు నిమిషాల్లో ముగిసే పెళ్లి చూపులకు ప్రాముఖ్యత ఉండేది. ఆ తరువాత కాలం మారింది. ప్రేమించుకొని ఒకరిపై ఒకరికి అభిప్రాయం ఏర్పడ్డాక అభిరుచులు  కలిశాక పెళ్లి చేసుకునే వారు. ఇప్పుడు కాలం మరింత ఫాస్ట్‌ అయింది. కలిసి కొంతకాలం జీవించి ఆ తరువాత తనకి సరిపోతాడా? లేదా? అనే నిర్ణయం తీసుకునే అవకాశం వచ్చింది. ఒక తరానికి మరో తరానికి నిర్ణయాలు తీసుకోవడంలో చాలా తేడాలొచ్చాయి. వాటిని మనం కూడా అర్థం చేసుకోవాలి... అని చెప్పుకొచ్చింది. నిత్య చెప్పింది వాస్తవమే అయినప్పటికీ నిత్యకు సహజీవనంపై చెడు అభిప్రాయం మాత్రం లేదని అర్థమవుతోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ