Advertisementt

‘దోచెయ్‌’కు వణుకు పుట్టిస్తోన్న ‘గంగ’!

Tue 21st Apr 2015 04:10 AM
lawrence,naga chaithanya,ganga movie,dohchay movie  ‘దోచెయ్‌’కు వణుకు పుట్టిస్తోన్న ‘గంగ’!
‘దోచెయ్‌’కు వణుకు పుట్టిస్తోన్న ‘గంగ’!
Advertisement
Ads by CJ

లారెన్స్‌తో పోటీపడాలా? వద్దా? అనే విషయంలో నాగచైతన్య సందిగ్దంలో ఉన్నాడని ఫిల్మ్‌నగర్‌టాక్‌. ఈనెల 24న విడుదలకు ‘దోచెయ్‌’ సినిమా రెడీ అయింది. సోలోగా వచ్చి హిట్‌ కొట్టాలని యూనిట్‌ భావించింది. సోలోగా వచ్చి దున్నేయవచ్చు అనుకున్న చైతూ ఆశలపై లారెన్స్‌ ‘గంగ’ నీళ్లు చల్లుతోంది. వాస్తవానికి లారెన్స్‌ ‘కాంచన2’ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో 17నే విడుదలకావాల్సింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం తమిళంలో విడుదలయినప్పటికీ తెలుగులో వారం రోజులు ఆలస్యంగా విడుదలకు సిద్దమవుతోంది. ఈ ఆలస్యమే చైతూకు నిద్రపట్టకుండా చేస్తోంది,. తమిళనాట లారెన్స్‌ ‘కాంచన 2’ చిత్రం బి,సి సెంటర్లలో అద్బుతమైన టాక్‌తో కలెక్షన్లు కొల్లగొడుతోంది. అదే పరిస్థితి ‘గంగ’కు తెలుగులో కూడా వచ్చే అవకాశం ఉంది. బి,సి సెంటర్లలో ‘గంగ’ హవా సాగుతుందనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. పోనీ ‘దోచెయ్‌’ను వారం వాయిదా వేద్దామంటే మే 1న ‘లయన్‌’ వచ్చేస్తోంది. ఇక ‘గంగ’కు తమిళ టాకే తెలుగులో కూడా వస్తే ‘దోచెయ్‌’కు బి,సి సెంటర్లలో ఎదురుదెబ్బ తగలవచ్చు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ