Advertisementt

రాధికాఆప్టేకు చురకలంటించిన కృతిసనన్‌!

Wed 22nd Apr 2015 05:01 AM
radhika apte,kriti sanon,telugu film industry,counter attack  రాధికాఆప్టేకు చురకలంటించిన కృతిసనన్‌!
రాధికాఆప్టేకు చురకలంటించిన కృతిసనన్‌!
Advertisement
Ads by CJ

తెలుగులో ‘రక్తచరిత్ర, ధోని, లెజెండ్‌’ చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ముంబై భామ రాధికాఆప్టే. ప్రస్తుతం ఆమె బాలకృష్ణ సరసన ‘లయన్‌’ చిత్రంలో కూడా నటిస్తోంది. ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తెలుగు సినీ పరిశ్రమపై షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. ఒక్క తెలుగులో తప్ప తనకు మిగతా అన్ని రీజనల్‌ లాంగ్వేజెస్‌లో వర్క్‌ బాగా ఎంజాయ్‌ చేశానని, తెలగు సినీ పరిశ్రమలో మాత్రం పురుషాధిపత్యం ఎక్కువ అంటూ ఏదేదో మాట్లాడిరది. తాజాగా మరో ముంబై భామ ‘1’ (నేనొక్కడినే) హీరోయిన్‌, ప్రస్తుతం నాగచైతన్య సరసన ‘దోచెయ్‌’ చిత్రంలో నటిస్తున్న కృతిసనన్‌ ... తెలుగు సినీ పరిశ్రమ గురించి మాట్లాడుతూ... టాలీవుడ్‌ వాతావరణం చాలా బాగుంటుంది. నేను పని చేసిన రెండు సినిమాలకు అందరూ చాలా సహకరించారు. ఎక్కడా నాపై వివక్ష చూపలేదు... అని స్పష్టం చేసింది. తెలుగు సినీపరిశ్రమ పై అబాండాలు వేసిన రాధికాఆప్టేకు కృతిసనన్‌ తన కామెంట్స్‌తో చురకలంటించిందని అంతా చర్చించుకుంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ