Advertisementt

బంగారం పై వర్మ కామెంట్స్..!

Wed 22nd Apr 2015 08:26 AM
ram gopal varma,dulquer salmaan,mammootty,ok bangaram movie  బంగారం పై వర్మ కామెంట్స్..!
బంగారం పై వర్మ కామెంట్స్..!
Advertisement
Ads by CJ

కాంట్రవర్సీలలో ముందుండే వర్మ మరో సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు. 'టెంపర్' సినిమా చూసి జూనియర్ ఎన్టీఆర్ ముందు సీనియర్ ఎన్టీఆర్ ఎందుకు పనికిరారు అన్నట్లుగా మాట్లాడి వార్తల్లో నిలిచారు. ఈ విషయం మరువక ముందే మరో స్టార్ హీరోను తక్కువ చేసి మాట్లాడారు. మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి కుమారుడు దుల్కర్ నటించిన 'ఓకే బంగారం' సినిమా చూసిన రామ్ గోపాల్ వర్మ మమ్ముట్టిని టార్గెట్ చేసాడు. తన ట్విట్టర్ లో ''ఇప్పుడే మణిరత్నం సినిమా చూసాను. అవార్డ్ కమిటీ మెంబర్స్ కు ఏ మాత్రం సెన్స్  ఉన్నా మమ్ముట్టికి ఇప్పటివరకు ఇచ్చిన అవార్డులను వెన్నక్కి తీసుకొని వారి కుమారుడికి ఇవ్వాలి"

"దుల్కర్ తో పోలిస్తే మమ్ముట్టి ఓ జూనియర్ ఆర్టిస్ట్ అని మమ్ముట్టి తన కుమారుడి నుండి యాక్టింగ్ నేర్చుకోవాలని" ట్వీట్ చేసాడు అంతే కాకుండా "దుల్కర్ కేరళ గర్వించేలా చేస్తాడు. నాన్ కేరళలో కూడా తనేంటో రుజువు చేసుకుంటాడు. మమ్ముట్టి ఇన్ని సంవత్సరాల నుండి చేయలేనిది అతను చేస్తాడు" అని చెప్పుకుంటూ వచ్చాడు. మరి ఈ ట్వీట్ల పై మమ్ముట్టి, దుల్కర్ ఎలా స్పందిస్తారో చూడాలి..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ