ప్రస్తుతం మహేష్‌బాబు కొరటాల శివ దర్శకత్వంలో ‘శ్రీమంతుడు’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ప్రస్తుతానికి ‘శ్రీమంతుడు’ అని పేరు ఖరారు చేయకపోయినప్పటికీ అదే ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. కాగా ఇటీవల ఈ చిత్రంలోని మహేష్ క్యారెక్టర్‌కు సంబంధించిన ఫొటోలు లీక్ అయ్యాయి. ఈ చిత్రంలో మహేష్ మల్టీమిలియనీర్‌గా, ప్లేబోయ్ తరహా పాత్ర చేయనున్నట్లు సమాచారం. సినిమాలో తొలి అరగంట ఆ తరహాలోనే సాగుతుందని, ఆ తర్వాత మహేష్ తాను సాదించాలనుకున్న లక్ష్యం కోసం వేరే ఊరికి వెళ్లి మామూలుగా జీవించి... తాను అనుకున్నది సాధిస్తాడని తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో సుకన్య కూడా ఓ కీలకపాత్ర చేయనుంది. శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.!