‘ఐ’ చిత్రం తర్వాత దర్శకుడు శంకర్ రజనీకాంత్‌తో ‘రోబో 2’ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రంలో విలన్‌గా నటించమని ఆయన అమీర్‌ఖాన్‌ను కోరగా ఆయన తిరస్కరించాడు. దాంతో లోకనాయకుడు కమల్‌హాసన్‌ను విలన్‌గా చేయించాలని ఆయన తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈమధ్య విరామం లేకుండా వరుస చిత్రాలు చేస్తోన్న కమల్‌కు డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టంగా మారుతోందని సమాచారం. దీంతో శంకర్‌కు విక్రమ్‌తో ఉన్న అనుబంధం రీత్యా కమల్ చేయకుంటే ఆ విలన్ పాత్రను ఎలాగైనా విక్రమ్ చేత చేయించడానికి శంకర్ సిద్దపడుతున్నట్లు కోలీవుడ్ సమాచారం. కమలే కాదు.. విక్రమ్ నటించినా కూడా ఈ చిత్రానికి మరింత క్రేజ్ రావడం ఖాయమంటున్నాయి కోలీవుడ్ వర్గాలు...!