Advertisementt

వరుసగా సంపూ ఎటాక్!

Sun 26th Apr 2015 03:23 PM
sampoornesh babu,kobbarimatta,singham 123,sampoo  వరుసగా  సంపూ ఎటాక్!
వరుసగా సంపూ ఎటాక్!
Advertisement
Ads by CJ

బర్నింగ్‌స్టార్‌గా టాలీవుడ్‌ ప్రేక్షకులకు ‘హృదయకాలేయం’ చిత్రం ద్వారా పరిచితమై టాప్‌హీరోలను సైతం ఇమిటేట్‌ చేస్తూ నవ్వులు పూయించడం సంపూర్ణేష్‌బాబు స్పెషాలిటీ. తొలి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్న ఈయన మంచు ఫ్యామిలీ బేనర్‌ 24ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీలో మంచు విష్ణు నిర్మిస్తున్న ‘సింగం 123’ చిత్రంలో పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌పాత్రను పోషిస్తున్నాడు. పోలీస్‌ పాత్రలకు పేరడీగా ఈ చిత్రం రూపొందిందని సమాచారం. ఈ చిత్రం వేసవి కానుకగా రూపొందుతోంది. ఇక ఆయన నటిస్తున్న మరో చిత్రం ‘కొబ్బరిమట్ట’. ఈ చిత్రంలో ఆయన మూడు రకాల గెటప్పులలో వైవిధ్యంగా కనిపించి హాస్యం పండిరచనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్‌సాంగ్‌ ఒకటి విడుదలై అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం కూడా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ