తమిళంలో మురుగదాస్ దర్శకత్వం వహించిన ‘మాన్‌కరాటే’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. తమిళంలో స్పోర్ట్స్ కామెడీగా వచ్చిన ఈ చిత్రంలో శివకార్తికేయన్ హీరోగా నటించి మెప్పించాడు. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారు. శివకార్తికేయన్ పాత్రను నారారోహిత్ పోషించనున్నాడు. ఇటీవల సందీప్‌కిషన్ హీరోగా ‘జోరు’ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలు అశోక్, నాగార్జునలు ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మించనున్నారు. ‘జిల్’ విలన్ కబీర్ సింగ్ కీలకపాత్ర పోషించనున్న ఈ చిత్రాన్ని ‘గుండెల్లోగోదారి’ దర్శకుడు కుమార్‌నాగేంద్ర దర్శకత్వం వహించనున్నాడు.