పవన్‌కళ్యాణ్ కొత్త షాకింగ్ లుక్ ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. ఇదో సంచలన వార్త అయింది. పవన్ గడ్డం పెంచడం అందరినీ ఆశ్చర్యపరిచి రకరకాల ఊహాగానాలకు తెర తీసింది. అందులో ఒకటి ‘గబ్బర్‌సింగ్2’ సినిమా కోసమే పవన్ గడ్డం పెంచుతున్నాడని ఆయన అభిమానులు భావిస్తున్నారు. మీడియాలోనూ అదే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. ‘గబ్బర్‌సింగ్2’ కోసం ఈ గడ్డం కాదని అంటున్నారు. మరి దేనికిఆ ఈ గడ్డం పెంచే కార్యక్రమం అంటే త్రివిక్రమ్‌శ్రీనివాస్‌తో చేయబోయే ‘కోబలి’ కోసం అంటున్నారు. అందరూ ‘కోబలి’ చిత్రం ఆగిపోయిందనుకున్నారు. అయితే త్రివిక్రమ్ మాత్రం అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు ‘గబ్బర్‌సింగ్2’ పక్కన పెట్టి మరీ ‘కోబలి’ పూర్తి చేసే ఆలోచనలో పవన్ ఉండబట్టే ఈ లుక్ అని చెప్పుకుంటున్నారు.....!