దుల్కర్ సల్మాన్‌ను చూసి మమ్ముట్టి నటన నేర్చుకోవాలి అని వర్మ ట్విట్టర్ పోస్ట్ చేస్తే వెంటనే నేను పది జన్మలెత్తినా, ఎంత సాధించినా మా నాన్న స్థాయికి చేరుకోలేను.. అంటూ ‘ఓకేబంగారం’ హీరో దుల్కర్ సల్మాన్ ట్విట్టర్‌లో స్పందించాడు. వెంటనే తేరుకున్న వర్మ మమ్ముట్టికి, అతని అభిమానులకు క్షమాపణలు అని, తన ట్వీట్‌ను సరిగ్గా అర్థం చేసుకోలేదని చెప్పుకొచ్చాడు. వర్మ ట్వీట్ చేస్తూ... నేను ఏం ఫీల్ అవుతానో అదే మాట్లాడతాను అని అందరికీ తెలుసు. ఇదేమీ తొలిసారి కాదు. నేను నా ఆనందాన్ని ఇలా వ్యక్తం చేశాను. అలాగే నా ట్వీట్ల అర్థం... గొప్ప తండ్రికి అద్భుతమైన కొడుకు అని... ఎవరికౖౖెతే నా ఈ అభినందనలు సరిగ్గా అర్థం కావో వారికి నా క్షమాపణలు.... దయచేసి మీ తండ్రికి కూడా వివరించి చెప్పు, ఆయన కూడా అఫెండ్ అయితే ఆయనకు నా క్షమాపణలు... అని తెలిపాడు.