రవితేజ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కిక్2’. నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్‌రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మే నెలలో విడుదలకు సిద్దమవుతోన్న ఈ చిత్రంకు రన్‌టైమ్ ప్రాబ్లమ్ వచ్చిందని సమాచారం. 3గంటలకు పైగా సినిమా వచ్చిందని, అయితే అంత రన్ టైమ్ థియేటర్స్‌లో వర్కౌట్ కాదని, డిస్ట్రిబ్మూటర్లు, ఎగ్జిబిటర్స్ చెప్తున్న నేపథ్యంలో దాని లెంగ్త్ తగ్గించాలని ఎడిటర్ గౌతమ్‌రాజు కృషి చేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రతీ సీన్.. కీలకమైందిగా ఉందని దాంతో ఏ సీన్ ఎడిట్ చేసి లెంగ్త్ తగ్గించవచ్చనే సందిగ్దంలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా దర్శకుడు సురేంద్రరెడ్డి సీన్స్ కట్ చేయడానికి ఒప్పుకోవడం లేదని అంటున్నారు. రీసెంటుగా నిర్మాత, దర్శకుడు మధ్య మాటల యుద్దం జరిగిందని, త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్., ఎడిటింగ్ వర్క్ ఫినిష్ చేయమని నిర్మాత చెప్పినట్లు సమాచారం. మే రెండో వారంలో సినిమా రిలీజ్ చేయాలంటే స్పీడ్ పెంచాల్సిందే అని అంటున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తైన తర్వాత మాత్రమే రిలీజ్ డేట్ ఫైనల్ చేసి ఎనౌన్స్ చేద్దాం అని కళ్యాణ్‌రామ్ ఖచ్చితంగా చెప్పాడట. తన తాత పుట్టినరోజు అయిన మే 28న విడుదల చేయాలనేది కళ్యాణ్‌రామ్ అభిమతంగా చెబుతున్నారు.