నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా సత్యదేవా అనే నూతన దర్శకునితో కలిసి రుద్రపాటి రమణారావు నిర్మాణంలో ‘లయన్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం మే నెల రెండో వారంలో విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రంలోని బాలయ్య క్యారెక్టరైజేషన్ గురించి దర్శకుడు సత్యదేవా వివరిస్తూ... నిజాయితీని నమ్ముకున్న సిబిఐ అధికారి అతను. అయితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది తరహా డైలాగులు చెప్పడు. చట్టం కంటే వేగంగా స్పందిస్తాడు. న్యాయస్థానాలు, న్యాయశాస్త్రాలపై నమ్మకం ఉన్నా, తనే ఓ న్యాయస్థానమై, న్యాయమూర్తిగా తీర్పులిస్తుంటాడు. దుర్మార్గులను శిక్షిస్తాడు. అతని కథేంటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నాడు దర్శకుడు సత్యదేవా...!