పవన్‌కళ్యాణ్ సరసన అనుష్క నటిస్తే చూడాలని చాలా మంది కోరిక. ఈ కోరిక అతి త్వరలో నెరవేరనుందని సమాచారం. త్వరలో పవన్‌కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘కోబలి’ చిత్రం రూపొందనుంది. ఇప్పటివరకు ‘జల్సా, అత్తారింటికి దారేది’ చిత్రాలను చేసి మెప్పించిన ఈ కాంబినేషన్ ‘కోబలి’ కోసం ముచ్చటగా మూడోసారి కలిసి పని చేయనున్నారు. త్రివిక్రమ్ ఆల్‌రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాడని, పవన్‌కి కూడా వినిపించి ఓకే చేయించుకున్నాడని సమాచారం. కాగా ఈ చిత్రంలో హీరోయిన్‌గా అనుష్కను అనుకొంటున్నారట. దీనికి పవన్ కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడని, ఇది రెగ్యులర్ హీరోయిన్ పాత్రలా ఉండదని, కథలో కీలకంగా ఉంటూ హీరోతో సమానంగా నడిచే పాత్ర అని తెలుస్తోంది.