Advertisementt

ఠాగూర్ కథను మార్చిన క్రిష్..!

Wed 29th Apr 2015 10:42 AM
gabbar movie,krish,tagore movie,akshay kumar,sruthihasan  ఠాగూర్ కథను మార్చిన క్రిష్..!
ఠాగూర్ కథను మార్చిన క్రిష్..!
Advertisement
Ads by CJ
చిరంజీవి ఠాగూర్ ఆధారంగా తెరకెక్కుతున్న హిందీ చిత్రం గబ్బర్. అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి తెలుగువాడు క్రిష్ (రాధాకృష్ణ జాగర్లమూడి) దర్శకత్వం వహించాడు. తమిళంలో మురుగదాస్ తీసిన రమణ.. ఠాగూర్, గబ్బర్ చిత్రాలకు మాతృక అనే విషయం విదితమే. గబ్బర్ ట్రైలర్ చూడగానే ఎమోషన్ మిస్ అయ్యిందని దక్షినాది ప్రేక్షకులు పెదవి విరిచారు. ట్రైలర్లో ఎమోషన్ కాదు, చిత్రంలో కంటెంట్ కూడా కొత్తగా ఉంటుందట. 

రమణ(ఠాగూర్)లో 60 శాతం కథను మాత్రమే తీసుకున్నాం. సమాజంలో జరుగుతున్న యదార్ధ ఘటనలకు కథలో చోటు కల్పించామని అక్షయ్ కుమార్ స్పష్టం చేశారు. కమర్షియాలిటీ కోసం చిత్రాంగద సింగ్ చేత ప్రత్యేక గీతంలో నృత్యం చేయించారు. రీమేక్ చేస్తున్నప్పుడు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఒరిజినల్ కథలో మార్పులు చేయడం సహజమే. అయితే, ఇక్కడ 40శాతం కథను మార్చడం గమనార్హం. ఈ మార్పులు విజయంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో..! శృతి హాసన్ ఈ చిత్రంలో కథానాయికగా నటించింది.
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ