Advertisementt

సమ్మర్ రేస్ నుండి తప్పుకున్న సినిమా..!

Wed 29th Apr 2015 11:49 PM
dongata movie,lakshmi manchu,utthama villain,ganga movie  సమ్మర్ రేస్ నుండి తప్పుకున్న సినిమా..!
సమ్మర్ రేస్ నుండి తప్పుకున్న సినిమా..!
Advertisement
Ads by CJ

ఇటీవల 'దొంగాట' సినిమా చిత్రీకరణ ముగిసిందని మే1 న సినిమా రిలీజ్ చేయనున్నామని ప్రెస్ మీట్ పెట్టి కన్ఫర్మ్ చేసారు సినిమా నిర్మాత లక్ష్మి మంచు. మొన్నటి వరకు అసలు తగ్గేదే లేదని మే డే రోజే సినిమా రిలీజ్ చేస్తామని చెప్పింది. అయితే లక్ష్మి లేట్ గా ఒక విషయాన్ని గ్రహించి తన డెసిషన్ మార్చుకుందని సమాచారం. ఇప్పటికే ప్రేక్షకులలో అంచనాలు భారీగా పెరిగిన కమల్ హాసన్ 'ఉత్తమవిలన్' చిత్రం మే1 న రానుందని చాలా హడావిడి చేస్తున్నారు.

తమిళంలో ఘన విజయం సాధించిన రాఘవ లారెన్స్ 'గంగ' చిత్రం కూడా మే1 నే ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. కొన్ని సమస్యలు ఉన్నా నిర్మాత బెల్లంకొండ మాత్రం ఖచ్చితంగా మే డే రోజే చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే తమిళంలో హిట్ అయిన ఈ చిత్రానికి తెలుగులో కూడా డోకా ఉండదని పలువురు భావిస్తున్నారు. మరి ఈ రెండు సినిమాలకు పోటీగా 'దొంగాట' నిలబడడం కష్టం అనుకుందో ఏమో..? సమ్మర్ రేస్ నుండి తప్పుకుంది. ఇంకెప్పుడు రిలీజ్ చేస్తుందో చూడాలి..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ