Advertisementt

దేవిశ్రీకి అరుదైన అవకాశం!

Fri 01st May 2015 05:10 AM
devisriprasad,thamil movie,puli,vijay,sridevi,hansika,vairamuthu  దేవిశ్రీకి అరుదైన అవకాశం!
దేవిశ్రీకి అరుదైన అవకాశం!
Advertisement
Ads by CJ

సంచలన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ తాజాగా తమిళంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పులి’కి సంగీతం అందిస్తున్నాడు. తమిళ స్టార్‌ హీరో విజయ్‌, హన్సిక, శృతిహాసన్‌, శ్రీదేవి, సుదీప్‌ తదితరులు నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి శింబు దేవన్‌ దర్శకత్వం వహిస్తుండగా, దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ చిత్రానికి తమిళ లెజెండరీ పాటల రచయిత వైరముత్తు సాహిత్యాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రంలోని అన్ని పాటలకు వైరముత్తునే సాహిత్యం అందిచడం విశేషం కాగా.. తన 15ఏళ్ల కెరీర్‌లో వైరముత్తుతో కలిసి పనిచేయడం దేవిశ్రీకి ఇదే మొదటిసారి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దేవిశ్రీ వైరముత్తును ఘనంగా సన్మానించాడు. తన కెరీర్‌లో ఇప్పటివరకు ఆరు జాతీయ అవార్డులు, భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ్‌ అందుకున్న వైరముత్తుతో కలిసి పని చేసే అవకాశం రావడం ఈనాటి సంచలన సంగీత దర్శకులకు చాలా అరుదైన ఘనతగా చెప్పుకోవచ్చు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ