‘ముని, కాంచన, గంగ’ చిత్రాలతో వరుస సీక్వెల్స్‌తో హిట్ కొట్టాడు రాఘవలారెన్స్, ఇక ‘సింగం, సింగం2’లతో తమిళస్టార్ సూర్య కూడా వరుస హిట్స్ అందుకున్నాడు. దీంతో తాజాగా లారెన్స్, సూర్యలు తమ చిత్రాల తదుపరి సీక్వెల్స్‌కు రెడీ అవుతున్నారు ‘ముని4’కి లారెన్స్ సిద్దం అవుతుండగా, ‘సింగం3’కి సూర్యతో పాటు దర్శకుడు హరి స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నాడు. వీరిద్దరూ సరికొత్త చరిత్రకు నాంది పలుకుతున్నారు. ఇండియాలో ‘ధూమ్’ సిరీస్ తర్వాత వరుసగా మూడు విజయాలను అందుకున్న దర్శక, నటునిగా రాఘవలారెన్స్ చరిత్రలో నిలిచిపోతున్నాడు. హర్రర్ కామెడీని నమ్ముకొని లారెన్స్, పోలీస్ యాక్షన్ సినిమాలతో సూర్య తమ తమ స్థాయిలో దూసుకెళుతున్నారు.