Advertisementt

రీఎంట్రీ ఇస్తోన్న సౌందర్యరాశి!

Thu 07th May 2015 03:02 PM
jayapradha,reeentry,bollywood,rajjole movie  రీఎంట్రీ ఇస్తోన్న సౌందర్యరాశి!
రీఎంట్రీ ఇస్తోన్న సౌందర్యరాశి!
Advertisement
Ads by CJ

సౌతిండియా సినిమాలతో పాటు బాలీవుడ్‌ను ఏలిన అందాల తార జయప్రద. అతిలోక సుందరి శ్రీదేవికి ఆ రోజుల్లో గట్టి పోటీనిచ్చిన హీరోయిన్‌ ఆమె. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఒకానొక దశలో దేశరాజకీయాల్లోనే అమర్‌సింగ్‌తో కలిసి కీలకంగా మారిన ఆమె త్వరలో వెండితెరపై మరలా ఓ వెలుగు వెలిగేందుకు రెడీ అవుతోంది. 2013లో కంగనారౌనత్‌ నటించిన బాలీవుడ్‌ మూవీ ‘రజ్జోల్‌’లో ఓ చిన్న పాత్ర చేసిన ఆమె ఈసారి మళ్లీ పూర్తిస్థాయిలో వెండితెరపై రీఎంట్రీ ఇవ్వనుంది. దర్శకుడు సంజయ్‌ శర్మ దర్శకత్వంలో రూపొందే ఓ చిత్రంలో ఆమె రాణిసాహెబా అనే కీలకపాత్రను పోషిస్తోంది. ఇంకా టైటిల్‌ ఖరారు కాని ఈ సినిమా మలేషియా, శ్రీలంక, నేపాల్‌లలో షూటింగ్‌ జరుపుకోనుంది. దీంతోపాటు ఆమె ఓ మలయాళ చిత్రంలో కూడా  ప్రధానపాత్రను పోషిస్తోంది. మరి ఆమె తెలుగుతెరపై ఎప్పుడు కనిపిస్తుందో వేచిచూడాల్సివుంది....!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ