ఇలాంటివార్తలు చాలా సార్లు విన్నామని అందరూ అనుకోవచ్చు. కానీ అనష్కకు మాత్రం త్వరలో వివాహం జరుగనుందనేది వాస్తవం. ఇక ఆమె నటించిన ‘బాహుబలి, రుద్రమదేవి, సైజ్ జీరో’ ల తర్వాత ఆమె ఇక సినిమాలు ఒప్పుకోదనే వార్తలు వినిపిస్తున్నాయి.. అనుష్క పెళ్లికి ఇంట్లో వారు కూడా ముహూర్తాలు వెదుగుతున్నారు. అనుష్క ఆల్‌రెడీ వరుడిని కూడా సెలక్ట్ చేసుకుందిట. ఇటీవల అనుష్క ‘సైజ్‌జీరో’ చిత్రం షూటింగ్ నిమిత్తం దుబాయ్ వెళ్లింది, తీరా అక్కడ చూస్తే అనుష్కను పెళ్లాడబోయో వ్యక్తి ప్రత్యక్షమయ్యాడట...! దుబాయ్‌లో పెళ్లికి సంబంధించిన షాపింగ్ కూడా చేసేశారని తెలుస్తోంది. ఇంతకీ ఆ అదృష్టవంతుడు ఎవరో...?