Advertisementt

సల్మాన్‌ ఆ సింబల్‌ ఎందుకు చూపించారు...??

Sat 09th May 2015 05:39 PM
salmankhan,bail,victory symbol  సల్మాన్‌ ఆ సింబల్‌ ఎందుకు చూపించారు...??
సల్మాన్‌ ఆ సింబల్‌ ఎందుకు చూపించారు...??
Advertisement
Ads by CJ

జైౖలు చిప్పకూడు తప్పదనుకున్న సల్మాన్‌ఖాన్‌కు హైకోర్టు ఊరట కలిగించింది. ఐదేండ్ల జైలుశిక్ష విధిస్తూ సెషన్స్‌ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడమే కాకుండా సల్మాన్‌కు బెయిల్‌ కూడా ఇచ్చి హైకోర్టు కండలవీరుడికి తాత్కాలిక ఉపశమనం కలిగించింది. అయితే సల్మాన్‌ జైలుకు వెళతారా..? లేక ఇంటికి వస్తారా అన్న అనుమానాలతో ఆయన అభిమానులు శుక్రవారం హైకోర్టుకు భారీగా తరలివచ్చారు. ఇక బెయిల్‌ దక్కడంతో సంతోషంలో ఉన్న సల్మాన్‌ బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా ఆయన తన 'జయహో' చిత్రంలోని మూడు వేళ్ల సింబల్‌ను చూపిస్తూ అభిమానులకు అభివాదం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ సినిమాలో మూడు వేళ్ల సింబల్‌తో సల్మాన్‌.. ఒకసారి సాయం పొందితే మరో ముగ్గురికి సాయం చేయడంటూ సందేశం ఇస్తారు. ఇప్పుడు కూడా సల్మాన్‌ అదే సింబల్‌ను చూపించడం అభిమానులకు అర్థంకాలేదు. సల్మాన్‌ బెయిల్‌ పొందడం వెనుక ఎవరి సాయమన్న ఉందన్న అనుమానాలు వెలువడుతున్నాయి. ఏదిఏమైనా తమ హీరో జైలుకు వెళ్లకుండా ఇంటికి రావడం సల్మాన్‌ అభిమానుల్లో అంతులేని సంతోషాన్ని నింపింది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ