సాధారణంగా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అంటే ‘నా చిత్రం.. నా ఇష్టం... ఇష్టముంటే చూడండి... లేకపోతే లేదు...’ అనే రకం. అలాంటిది తన 25ఏళ్ల కెరీర్‌లో ఆయన మొదటిసారిగా తన సినిమాకు పాజిటివ్ పబ్లిసిటీ చేస్తున్నాడు. ఆయన తన సొంత సినిమాకు భజన చేయడం ఇదే తొలిసారి. తాను దర్శకత్వం వహించిన ‘365డేస్’ చిత్రం విషయంలో రోజుకో విధంగా పాజిటివ్ ట్వీట్ చేస్తున్నాడు. తన ‘365డేస్’ సినిమా మంచి సినిమా అని, ఆ చిత్రం తనను పూర్తిగా మార్చేసిందని, విశ్వనాథ్‌గారు ‘రక్తచరిత్ర’ చేస్తే ఎలా ఉంటుందో... తాను చేసిన ‘365డేస్’ చేయడం కూడా అలాంటిదే.. ...అంటున్నాడు. ఈ చిత్రంలో బంధాలు, అనుబంధాలు తప్ప రక్తపాతం ఉండదని చెబుతూ... మొదటిసారిగా తన చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్‌ను రప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తానికి వర్మ నిజంగా మారాడా? లేక తన సినిమా కోసం మారినట్లు కనిపిస్తున్నాడా? అనేది అందరిలో కలుగుతోన్న అనుమానం.