Advertisementt

నిత్యమీనన్‌కి హైట్‌ కష్టాలు!

Sun 10th May 2015 07:11 AM
nithya menen,rudhrama devi,height problems,nithya menen height,anushka  నిత్యమీనన్‌కి హైట్‌ కష్టాలు!
నిత్యమీనన్‌కి హైట్‌ కష్టాలు!
Advertisement
Ads by CJ

సినిమాలో కథానాయికగా నిత్యమీనన్‌ నటిస్తుందంటే చాలు... సెట్‌ ప్రాపర్టీస్‌లో భాగంగా రోజూ షూటింగ్‌కి ఓ స్టూల్‌ని తీసుకు రావల్సిందే.  కథానాయకులతో రొమాన్స్‌ చేసే సన్నివేశమైనా, పాటలయినా... వెంటనే నిత్య కాళ్ల కింద ఓ పెద్ద స్టూల్‌ని వేయాల్సి ఉంటుంది. మన హీరోలేమో ఒకొక్కరు ఆరడుగులు ఉంటారు. నిత్యమీనన్‌ మాత్రం చాలా పొట్టి. అందుకే షూటింగ్‌ సమయంలో హైట్‌కి సంబంధించి రకరకరాల సమస్యలొస్తుంటాయి. కానీ నిత్యమీనన్‌ మంచి నటి కావడం, ఆమె ఏ కథానాయకుడితో కలిసి నటించినా కెమిస్ట్రీ అదిరిపోవడంలాంటి కారణాలతో ఆమెని హీరోయిన్‌గా ఎంపిక చేసుకొంటుంటారు.   
‘రుద్రమదేవి’ చిత్రీకరణ సమయంలో  తన హైట్‌ సమస్య ఎంతగా వేధించిందో సరదాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది నిత్య. ‘‘అనుష్కేమో హైట్‌, నేనేమో పొట్టి. మా ఇద్దరిమధ్య ఓ పాట ఉంటుంది. ఆ పాట చిత్రీకరణ జరిగినన్నాళ్లు దర్శకుడు గుణశేఖర్‌ చాలా ఇబ్బంది పడ్డార’’ని చెప్పుకొచ్చింది నిత్య. ‘‘అనుష్క అంత హైట్‌గా కనిపించాలని నేను ఏడంగుళాల హై హీల్స్‌ వేసుకొని డ్యాన్స్‌ వేశా. చెప్పులు అంత హైట్‌గా ఉండటంతో డ్యాన్స్‌ చేస్తూ మాటిమాటికీ కింద పడిపోయేదాన్ని. నా సమస్య చూసి అనుష్కనే కాళ్లు వంచి డ్యాన్స్‌ చేసింది. లేదంటే ఇంకా ఇబ్బంది పడాల్సి వచ్చేది’’ అని నవ్వుతూ చెప్పుకొచ్చింది నిత్య.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ