Advertisementt

విచిత్రమైన రూట్లో సోనమ్‌!

Sun 10th May 2015 08:26 AM
sonam kapoor,salman khan,lady gabbar,prem ratan dhan payo  విచిత్రమైన రూట్లో సోనమ్‌!
విచిత్రమైన రూట్లో సోనమ్‌!
Advertisement
Ads by CJ

ఇండస్ట్రీకి వచ్చి దాదాపు దశాబ్దం కావొస్తున్నా స్టార్‌ హీరోయిన్‌ హోదా దక్కించుకోలేకపోతున్న హీరోయిన్‌ సోనమ్‌కపూర్‌. లేడీ గబ్బర్‌గా పేరుతెచ్చుకున్న ఈ హీరోయిన్‌కు అందం, అభినయం, గ్లామర్‌గా కనిపించడం, మంచి ఫిల్మ్‌బ్యాగ్రౌండ్‌ వంటివి అన్నీ ఉన్నా ఆమె మాత్రం చిత్రవిచిత్రమైన రూట్లో వెళుతోంది. ప్రస్తుతం ఆమె సల్మాన్‌ఖాన్‌ సరసన ‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌పాయో’ చిత్రంతోపాటు, వర్జాబాన్‌ అనే బయోపిక్‌ మూవీలో నటిస్తోంది.

స్టార్‌ హీరోలు ఉన్నారు కదా! అంటూ ఒప్పుకోకుండా కేవలం మంచి సబ్జెక్ట్‌లతో వచ్చే సినిమాలకే ప్రాధాన్యం ఇస్తూ... కేవలం స్టార్‌హీరోలపైనే ఫోకస్‌ పెట్టకుండా ముందుకు సాగుతోంది. దీంతో స్టార్‌ హీరోలు తమ చిత్రాల్లో ఆమెకు స్థానం కల్పించడం లేదు. అయినా కూడా తన నిర్ణయం విషయంలో గట్టి పట్టుదలతో ఉండి, తన దారి ఇంతే అని ప్రశంసలు పొందుతోంది ఈ లేడీ గబ్బర్‌....!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ