‘గ్రీకువీరుడు’ ఫ్లాప్ తర్వాత దర్శకుడు దశరథ్ తదుపరి చిత్రం గురించి చాలా ప్రయత్నించాడు. కానీ ఏ హీరో కరుణించలేదు. ఆ మధ్య దశరథ్, హీరో వెంకటేష్‌కు ఓ కథ వినిపించాడు. ఆ కథ వెంకీకి పూర్తి సంతృప్తినివ్వలేదు. అయినా కూడా వెంకీ మరో అవకాశం ఇచ్చి కథలో మార్పులు సూచించి పక్కాగా కథ రెడీ చేసుకోని రమ్మనాడు. అయినా కూడా దశరథ్.. వెంకీని ఆకట్టుకోలేకపోయాడు.
ఇక తాజాగా ఈ కథతోనే మనోజ్‌తో ఓ సినిమా తెరకెక్కించడానికి రెడీ అయ్యాడు దశరథ్. వచ్చే నెలలో చిత్రీకరణ ప్రారంభం కాబోతున్న ఈ చిత్రాన్ని ‘సూర్య వర్సెస్ సూర్య’ నిర్మాత మల్కాపురం శివకుమార్ నిర్మించబోతున్నాడు. అయితే వెంకటేష్ రిజెక్ట్ చేసిన కథతో దశరథ్ మనోజ్‌కు హిట్ ఇవ్వగలడా? అని ఫిల్మ్‌నగర్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.