ఇది వినడానికి కాసింత అతిశయోక్తిగా అనిపించిన ఇది నిజమేనని అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. ‘బలుపు’కు ముందు 7కోట్ల పారితోషికాన్ని అందుకున్న రవితేజ తన తాజా చిత్రానికి ఏకంగా 10 కోట్ల పారితోషికాన్ని అందుకుంటున్నాడని తెలిసింది. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వలో కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్న ‘కిక్-2’ చిత్రంతో పాటు సంపత్‌నంది దర్శకత్వంలో ‘బెంగాల్ టైగర్’ చిత్రంలో నటిస్తున్న రవితేజ తన తాజా చిత్రాన్ని ‘కందిరీగ’ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వలో నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు.
ఈ చిత్రం కోసమే రవితేజ 10కోట్ల పారితోషికాన్ని అందుకోబోతున్నాడని సమాచారమ్. మునుపటితో పోలీస్తే రవితేజ, క్రేజ్, మార్కెట్ డౌన్‌ఫాల్‌లో వుంది. అయినా కూడా ఈ హీరోకి 10కోట్ల పారితోషికాన్ని ఇవ్వడానికి ఒప్పుకున్న యూనివర్శల్ మీడియా పతాకం అధినేత డీవీవీ దానయ్య గట్స్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!