Advertisementt

మహేష్‌కు బోలెడు కోపం వచ్చింది!

Mon 11th May 2015 08:54 AM
mahesh babu,srimanthudu movie,bahubali,rajamouli  మహేష్‌కు బోలెడు కోపం వచ్చింది!
మహేష్‌కు బోలెడు కోపం వచ్చింది!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుకు చాలా కోపం వచ్చిందట. అది కూడా ‘బాహుబలి’ యూనిట్‌పై అని అంటున్నారు. మొదటి నుండి రాజమౌళి ‘బాహుబలి’ చిత్రాన్ని మే లో విడుదల చేస్తామని చెబుతూ వస్తున్నాడు. దాంతో మహేష్‌ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ‘శ్రీమంతుడు’ (వర్కింగ్‌టైటిల్‌)చిత్రాన్ని నింపాదిగా షూటింగ్‌ చేస్తూ జులైలో రావడానికి రెడీ అయ్యాడు. అయితే ఉన్నట్లుండి రాజమౌళి ‘బాహుబలి’ని జులైలో విడుదల చేస్తామని చెప్పడంతో మహేష్‌కు చాలా కోపం వచ్చిందని అంటున్నారు.

రెండు చిత్రాలు భారీ చిత్రాలే. రెండూ కూడా మూడు నాలుగు వారాలు థియేటర్లలో ఉండాల్సిన చిత్రాలు, మరి ఇవి రెండు దాదాపు ఒకేసారి వస్తే రెండు చిత్రాలు నష్టపోతాయని, నిర్మాతల నుండి డిస్ట్రిబ్యూటర్ల వరకు అందరూ నష్టపోతారనే ఉద్దేశ్యంలో మహేష్‌ ఉన్నాడట..! మరి ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందో వేచిచూడాల్సివుంది.....!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ