Advertisementt

కేక పుట్టిస్తోన్న సంపూ!

Tue 12th May 2015 11:21 PM
sampoornesh babu,manchu vishnu,singam 123 movie  కేక పుట్టిస్తోన్న సంపూ!
కేక పుట్టిస్తోన్న సంపూ!
Advertisement
Ads by CJ

‘మెంటల్‌ నీకు రావాలేమో...నాకు 365డేస్‌ ఆన్‌లో ఉంటుంది.... ప్రెజర్‌ ఎక్కువయితే ఆపేయడానికి కుక్కర్‌లోని పప్పును కాదు... గ్యాస్‌ స్టవ్‌ మీద నిప్పును.... కోత మొదలైంది.. ఇక వెళ్లేది ఐసియులోకి కాదు... ఐస్‌ బాక్స్‌ల్లోకి.... ఇలా పేరడీ డైలాగ్స్‌ను పవర్‌ఫుల్‌గానే చెబుతున్నప్పటికీ వినేవారికి, చూసేవారికి తెగ నవ్వు తెప్పిస్తున్నాడు... బర్నింగ్‌స్టార్‌ సంపూర్ణేష్‌బాబు అలియాస్‌ సంపూ. కాగా ఈ డైలాగ్స్‌తో రూపొందించి కట్‌చేసిన ట్రైలర్‌ ఇప్పుడు అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ‘సింగం123’గా రచ్చ చేయడానికి వస్తోన్న ఈ చిత్రాన్ని మంచు విష్ణు నిర్మిస్తుండటం విశేషం. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే మంచు విష్ణు అందిస్తున్నాడట. అనఫిషియల్‌ న్యూస్‌ ఏమిటంటే... ఈ చిత్రానికి మాటలు, డైరెక్షన్‌ కూడా దగ్గరుండి విష్ణునే చేసుకున్నాడని తెలుస్తోంది. సంపూ మరీ పెద్ద హిట్‌ కొట్టకపోయినా... మంచు విష్ణు , ఆయన సోదరుడు మంచు మనోజ్‌లు నటించి, నిర్మించిన చిత్రాలకంటే ఈ సంపూ సినిమానే బాగా ఆడుతుందని విష్ణుపై సెటైర్లు వేస్తున్నారు కొంతమంది.....!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ