కంటెంట్‌లో బూతు ఉందని సినిమా రిజెక్ట్ చేసిందట పోర్న్‌స్టార్ సన్నిలియోన్. ఇది నిజమేనా అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. సన్నిలియోన్ ఏంటి? బూతు ఉందని రిజెక్ట్ చేయటం ఏమిటబ్బా..? అంటూ తలలు పట్టుకుంటున్నారు బాలీవుడ్ వాసులు. అది కూడా ఏక్తాకపూర్ వంటి పెద్ద నిర్మాత ప్రాజెక్ట్ అంటే ఆశ్చర్యమే. ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఏమిటీ.. అంటే ఆమె ప్రతిష్టాత్మకంగా భావించి రూపొందించనున్న ‘ఎక్స్‌ఎక్స్‌ఎక్స్’చిత్రంలో అని సమాచారం. ఈ చిత్రంలో మొదట సన్నిని అడిగితే ఆమె వెంటనే మరో ఆలోచన లేకుండా నో చెప్పిందట. అయితే ఇందులో మితిమీరిన న్యూడిటీ ఉంది కాబట్టే నో చెప్పిందని అంటున్నారు. అయితే బాలీవుడ్‌లోని కొందరి వాదన ప్రకారం ఈ సినిమా కోసం సన్నిలియన్ ఏకంగా ఐదుకోట్లు డిమాండ్ చేసిందని, ఏక్తాకపూర్ ఆమెకి అంత సీన్‌లేదని నో చెప్పిందని అంటున్నారు. నిజనిజాలు ఎలా ఉన్నా.... బాలీవుడ్ మీడియాలో మాత్రం ఈ విషయం హాట్‌టాపిక్ అయింది.