గతంలో శింబు, ప్రభుదేవాలతో ప్రేమాయణం నడిపి పెళ్లి పీటలకు వరకు వెళ్లాల్సిన సమయంలో నయనతారకు కొన్ని అంతర్గత కారణాల వల్ల వివాహం జరగకుండా ఆగిపోయాయి. అయితే ఆ తర్వాత మరలా ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించి తమిళంలో వరుస చిత్రాలతో భారీ రెమ్యూనరేషన్ వసూలు చేస్తూ సౌతిండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. కానీ కోలీవుడ్ మీడియా మాత్రం నయనతార మరోసారి ఓ తమిళ దర్శకుడితో ప్రేమలో పడిరదని, ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలిసినప్పటికీ వారు పాజిటివ్‌గానే స్పందించి ఇద్దరికీ వివాహం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు....తమిళంలో ‘పోడాపోడి’ చిత్రంతో దర్శకునిగా పరిచయమైన విఘ్నేష్ శివన్... ప్రస్తుతం ధనుష్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ‘నానుమ్ రౌడీదాన్’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో నయనతారనే హీరోయిన్ కావడం విశేషం. ఇద్దరూ సెట్స్‌పై బాగా చనువుగా ఉంటున్నారని, ఇటీవలే ఇద్దరూ కలిసి కొన్నిరోజులు మాల్దీవుల్లో గడిపి వచ్చారని సమాచారం. కాగా ఇటీవల నయనతార విఘ్నేష్‌శివన్‌కు ఓ ఖరీదైన కారు బహుమతిగా ఇచ్చిందని కోలీవుడ్ మీడియా అంటోంది. కనీసం ఈ ప్రేమ అయినా పెళ్లిపీటల దాకా వెళుతుందో లేదో చూడాల్సివుంది!