Advertisementt

పూరి, రాజమౌళిల మధ్య వర్మ వార్ ??

Fri 15th May 2015 09:56 AM
ram gopal varma,puri jagannath,rajamouli,rgv twitter  పూరి, రాజమౌళిల మధ్య వర్మ వార్ ??
పూరి, రాజమౌళిల మధ్య వర్మ వార్ ??
Advertisement
Ads by CJ

రామ్‌గోపాల్‌వర్మ తన సినిమాలను పక్కనపెట్టి శిష్యుడినే పొగడటమే పనిగా పెట్టుకున్నట్టుంది. తాజాగా మహేష్‌బాబుతో తన మూడో సినిమా చేయబోతున్నట్లు పూరి జగన్నాథ్‌ ప్రకటించారు. అయితే ఈ సినిమా స్టోరీని తన గురువు వర్మకు పూరి వినిపించారట. ఇక ఈ సినిమా స్టోరీ విన్న వర్మ పూరిని పొగడ్తలతో ముంచెత్తాడు. తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పూరి జగన్నాథ్‌ గతంలో మహేష్‌బాబుతో తీసిన సినిమాలకంటే కూడా ఈ సినిమా పది రెట్లు బాగుంటుందని, మహేష్‌బాబు హీరోయిజం హిమాలయాలను తాకుతుందని చెప్పాడు. 

అంతటితో ఆగకుండా మరో ట్వీట్‌లో ఈ సినిమాలో మహేష్‌బాబు క్యారెక్టర్‌, డైలాగ్స్‌ సనీలియోన్‌ కంటే పది రెట్లు సెక్సీగా ఉన్నాయని, పోకిరి, బిజినెస్‌మాన్‌, దూకుడు కంటే పదిరెట్లు బహుబలియర్‌ అంటూ రాసుకొచ్చాడు. ఇలా పూరి గురించి రాస్తూ రాజమౌళి సినిమా గురించి కూడా వర్మ చెప్పుకొచ్చారు. పూరి సినిమా పది రెట్టు బహుబలియర్‌ అంటూ వర్మ చేసిన ట్వీట్‌ దేన్ని సూచిస్తుందో అర్థంకాక ఆయన ఫాలోవర్స్‌ తికమకపడ్డారు. అంటే పూరి సినిమా బహుబలి కంటే కూడా పదిరెట్లు బాగుంటుందని వర్మ చెప్పకనే చెబుతున్నాడా..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ