అల్లరినరేష్ హీరోగా ఎటీవీ సమర్పణలో ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బేనర్‌పై రూపొందుతున్న చిత్రం ‘జేమ్స్‌బాండ్’ (నేనుకాదు.. నా పెళ్లాం...) అనేది ఉపశీర్షిక. సాక్షిచౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. రామబ్రహ్మం సుంకర నిర్మాత. సాయికిషోర్ మచ్చ దర్శకుడు. ఈ చిత్రం ఆడియో సందర్బంగా ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌లో హీరో ఉన్న ఒకే ఒక్క షాట్ ఉండటం ఆశ్చర్యకరం. దీన్నిబట్టి ఈ చిత్రం పూర్తిగా హీరోయిన్ చుట్టూ తిరిగే కథ అని అర్థమవుతోంది. ఆమె చేత చెప్పించిన డైలాగులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి ఈమధ్యకాలంలో సరైన హిట్ లేక మొహం వాచిపోయిన అల్లరినరేష్ ఈ చిత్రంతో హిట్ కొట్టడం గ్యారంటీ అని ఆశావహుల నమ్మకం.