Advertisementt

అభిరుచి ఉంది.. ప్లానింగే లేదు!

Mon 18th May 2015 10:41 AM
nara rohith,prathinidhi,asura movie  అభిరుచి ఉంది.. ప్లానింగే లేదు!
అభిరుచి ఉంది.. ప్లానింగే లేదు!
Advertisement
Ads by CJ

నారారోహిత్‌... ఉన్నంతలో ఈయన నటించే చిత్రాలు సమ్‌థింగ్‌ స్పెషల్‌గా ఉంటాయి. పనిచేయి... ఫలితం ఆశించకు అనే సూత్రం మీద ఆయన కెరీర్‌ నడుస్తోంది అని చెప్పాలి. ఇప్పటికే ఆయన చేతిలో బోలెడు సినిమాలు ఉన్నాయి. వాటిల్లో చాలా చిత్రాలు మొదలై, ఆ తర్వాత పోస్టర్స్‌ కూడా రిలీజైన చిత్రాలు ఉన్నాయి. కానీ ఏ సినిమా ఎప్పుడు వస్తుందో ఎవ్వరికి అర్థం కావడం లేదు. గత ఏడాది ఆయన నటించిన ‘ప్రతినిధి, రౌడీఫెల్లో’ చిత్రాలు విడుదలై మంచి పేరు సంపాదించిపెట్టాయి. ‘శంకర, మద్రాసీ, పండగలా వచ్చాడు’ వంటి చిత్రాలు చేస్తున్నాడు. తాజాగా ‘ఒక్కడుండే వాడు’ అనే సినిమాకు కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశాడు. కాగా ప్రస్తుతం విడుదలకు సిద్దమవుతోన్న ‘అసుర’ చిత్రం ట్రైలర్‌ అందరినీ అలరిస్తోంది.