సమంత... టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపుతున్న సమయంలో ఆమె హవాకు శృతిహాసన్ అడ్డుకట్ట వేసింది. దీంతో సమంత తన సొంత ఇంటికి పయనమై కోలీవుడ్‌లో టాప్ ప్లేస్‌పై కన్నేసింది. వాస్తవానికి సమంత కోలీవుడ్‌కు వెళ్లిన నేపథ్యంలో శృతిహాసన్ కేవలం టాలీవుడ్‌పై దృష్టి పెట్టి ఉంటే ఇక్కడ ఇప్పుడు ఆమే నెంబర్‌వన్ స్థానంలో ఉండేది. కానీ టాలీవుడ్‌ను రకుల్‌ప్రీత్‌సింగ్‌కు వదిలేసి సమంత వెళ్లిన చోటికే మరలా శృతి చేరి అక్కడ కూడా ఆమెకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది. పిల్లి-ఎలుకల మధ్య ఉండే వైరంలా సమంతను, శృతిహాసన్ టార్గెట్ చూస్తూ కోల్డ్‌వార్ నడుపుతోంది. దీంతో కోలీవుడ్‌లో కూడా ఇప్పుడు వీరిద్దరి మధ్య నువ్వా? నేనా? అన్న రేంజ్‌లో పోటీ ఉంది. ఇద్దరి చేతిలోనూ టాప్‌స్టార్స్ చిత్రాలు మూడేసి ఉన్నాయి. మరి సమంత ఎత్తులకు శృతి పైఎత్తులు ఎలా ఫలిస్తాయో వేచిచూడాల్సివుంది....!