హీరోయిన్లు ఏ విషయంలో అయినా పడతారో లేదో కానీ అందంగా ఉన్నారు... ఫలానా డ్రెస్లో మీరు మరింత సెక్సీగా ఉన్నారు... అంటే మాత్రం తెగ సంబరపడిపోతారు. సౌతిండియ్ స్టార్హీరోయిన్ సమంత కూడా అంతే. సమంత ఏ ఫంక్షన్కు వెళ్లినా డ్రస్సింగ్పై బాగా దృష్టిపెడుతుంది. అందంలో ప్రత్యేకంగా, ఇతర హీరోయిన్ల కంటే సెక్సీగా కనిపించాలనే విషయంలో ఆసక్తి చూపుతుంది. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ వేడుకలో సమంత హాట్లుక్తో దర్శనమిచ్చింది. అందరి చూపు ఆమె వైపే. ఆమె వేసుకున్న డ్రెస్ అదిరిపోయేలా ఉండటంతో ఇదే విషయాన్ని ఆమెతో అంటే అందుకు బదులిస్తూ... డ్రస్ విషయంలో బాలీవుడ్ వారితో పోల్చితే దక్షిణాది చిత్ర పరిశ్రమలో అభిరుచి తక్కువే అంది. తాను వేసుకున్న డ్రెస్ ఇతరులను బాగా ఆకర్షిస్తున్నప్పుడు తనకు కూడా సంతోషంగా ఉంటుందని చెప్పుకొచ్చింది.