Advertisementt

ఆ చాన్స్‌ పూరీకి మిస్‌ అయింది....!

Thu 21st May 2015 05:44 AM
poorijagannath,star director,rakul preeth singh,tollywood top heroine  ఆ చాన్స్‌ పూరీకి మిస్‌ అయింది....!
ఆ చాన్స్‌ పూరీకి మిస్‌ అయింది....!
Advertisement
Ads by CJ

తొలిసినిమా ఛాన్సే ఓ అగ్ర దర్శకుని ద్వారా వచ్చిందంటే నో చెప్పగలిగే ధైర్యం ఎవరికి ఉంది? కానీ ఓ కథానాయిక మాత్రం మొహమాటం  లేకుండా నో చెప్సేసింది. ఇంతకీ ఆ అగ్రదర్శకుడు ఎవరంటే పూరీజగన్నాథ్‌. హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌. రకుల్‌ మోడలింగ్‌రంగంలో ఇరగదీస్తున్నప్పుడు ఆమెలోని టాలెంట్‌ని పసిగట్టాడు పూరీ. వెంటనే ఆమెను కలిసి నా సినిమాలో హీరోయిన్‌గా చాన్స్‌ ఇస్తాను నటిస్తావా? అని అడిగాడట. దానికి రకుల్‌ కూడా ఓకే చెప్పేసింది. కాకపోతే ఒకేసారి బల్క్‌ డేట్స్‌ అడిగాడట పూరీ. కానీ ఆ సమయంలో ఇటు చదువు, అటు పరీక్షలు అని తెగ బిజిబిజీగా గడుపుతున్న రకుల్‌ మాత్రం ఇంత హడావుడిలో ఈ సినిమా చేయడం అంత అవసరమా..? తీరిగ్గా చేసుకుందాలే అని నిర్ణయించుకొని నో చెప్పిందట. అలా ఆమె పూరీ చేతుల ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయ్యే అవకాశాన్ని కోల్పోయింది. మొత్తానికి పూరీ చాన్స్‌ మిస్‌ అయినప్పటికీ ఇప్పుడు ఆమె టాలీవుడ్‌ టాప్‌హీరోయిన్లలో ఒకరిగా చోటు సంపాదించుకుంది. మరి పూరీ చేతుల్లో పరిచయం అయి ఉంటే ఈ అమ్మడు మరెంత బిజీగా ఉండేదో అనిపిస్తోంది కదూ....!  

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ