Advertisementt

రవితేజ మూడు కోరికలను ‘కిక్‌2’ తీరుస్తుందా...?

Thu 21st May 2015 06:11 AM
raviteja,kick2 movie,hatrick,kalyan ram,surendar reddy  రవితేజ మూడు కోరికలను ‘కిక్‌2’ తీరుస్తుందా...?
రవితేజ మూడు కోరికలను ‘కిక్‌2’ తీరుస్తుందా...?
Advertisement
Ads by CJ

త్వరలో మాస్‌మహారాజా రవితేజ నటిస్తున్న ‘కిక్‌2’ చిత్రంవిడుదలకు సిద్దమవుతోంది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్‌రామ్‌ 
నిర్మిస్తున్న ఈ చిత్రంపై రవితేజ చాలా నమ్మకాలు పెట్టుకొని ఉన్నాడు. ఈ చిత్రం ద్వారా తాను 50కోట్ల క్లబ్బులో చేరాలనేది అందులో ఒకటి. అంతేగాకుండా ఆయనకు తన 13ఏళ్ల కెరీర్‌లో ఇప్పటివరకు ఒక్క హ్యాట్రిక్‌  కూడా రాలేదు.  రెండు మూడు సార్లు దానికి దగ్గరగా వచ్చినప్పటికీ మూడో చిత్రాలు ఫ్లాప్‌ కావడంతో ఆయన కోరిక తీరలేదు. అదే ‘కిక్‌2’ హిట్టయితే ఆయనకు ‘బలుపు, పవర్‌’ వంటి కమర్షియల్‌ హిట్స్‌ తర్వాత ‘కిక్‌2’తో హ్యాట్రిక్‌ పూర్తవుతుంది. ఇక టాలీవుడ్‌లో సీక్వెల్స్‌గా తీసిన చిత్రాలు ఇప్పటి వరకు సక్సెస్‌ కాలేదు. చివరకు మెగాస్టార్‌ చిరంజీవి కూడా ‘శంకర్‌దాదా ఎం.బి.బి.యస్‌’ తర్వాత చేసిన ‘శంకర్‌దాదా జిందాబాద్‌’సైతం ఫ్లాప్‌ అయింది. సో..  ఈ సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేసి సీక్వెల్స్‌ కూడా హిట్టవుతాయని నిరూపించాలనే పట్టుదలతో రవితేజ ఉన్నాడట. కాబట్టి ‘కిక్‌2’ మూడు కోరికలను తీర్చాలనుకుంటున్న మాస్‌ మహారాజా రవితేజ కోరికలు నెరవేరుతాయో? లేదో వేచిచూడాల్సివుంది....!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ