Advertisementt

కలిసొచ్చిన అత్తకు దారిస్తున్నారు!

Fri 22nd May 2015 06:09 AM
nadiya,attarintiki daredi movie,ramcharan,srinu vaitla movie  కలిసొచ్చిన అత్తకు దారిస్తున్నారు!
కలిసొచ్చిన అత్తకు దారిస్తున్నారు!
Advertisement
Ads by CJ

నిన్నటితరంలో మంచి హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న నటి నదియా. ఆ తర్వాత ఆమె చాలాకాలం నటనకు దూరంగా ఉంది. అయితే ‘మిర్చి’ సినిమాలో ప్రభాస్‌కు తల్లిగా నటించి అందరినీ ఆకట్టుకుంది. ఇక పవన్‌కళ్యాణ్  ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో అద్భుతంగా నటించి ఆ పాత్రకు నిండుదనం తెచ్చింది. ఆ తర్వాత ‘దృశ్యం’లో కూడా కీలకపాత్రను  పోషించింది. తాజాగా ఆమె మరో మెగా హీరో సినిమాలో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. రామ్‌చరణ్‌-శ్రీనువైట్ల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంలో నదియా కీలకపాత్రను పోషించనుంది. ఆ పాత్ర రామ్‌చరణ్‌ తల్లి పాత్ర అని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. అయినా ఏ పాత్ర అనేది పక్కనపెడితే ఆమె ఈ చిత్రంలో కీలకపాత్రను పోషిస్తోంది అనేది మాత్రం వాస్తవం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ