Advertisementt

బాలయ్య 99కి ముహూర్తం కుదిరింది!

Fri 22nd May 2015 11:38 AM
balakrishna,lion movie,sri vasu,balakrishna 99th movie,gopi mohan,kona venkat   బాలయ్య 99కి ముహూర్తం కుదిరింది!
బాలయ్య 99కి ముహూర్తం కుదిరింది!
Advertisement
Ads by CJ

రీసెంట్‌గా ‘లయన్‌’తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరినీ నిరాశపరిచిన బాలయ్య ప్రస్తుతం తన 99వ చిత్రంపై దృష్టిపెట్టాడు. ఈ చిత్రానికి సంబధించిన ముహూర్తం కుదిరింది. దీంతో ఆ వేడుకకు రంగం సిద్దమవుతోంది. శ్రీవాస్‌ దర్శకత్వంలో ఈనెల 29న ఈ చిత్రాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వేడుకకు రామానాయుడు స్టూడియో వేదిక కానుంది. ఎరోస్‌ ఇంటర్నేషనల్‌తో పాటు వారాహిచలన చిత్రం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం స్క్రిప్ట్‌వర్క్‌ పూర్తయింది. దీనికోసం ఏకంగా ఐదుగురు రచయితలు కలిసి కసరత్తు చేశారు. కోనవెంకట్‌, గోపీమోహన్‌, బీవీఎస్‌ రవి, డైమండ్‌ రత్నం, శ్రీదర్‌ సీపానలు ఈ చిత్రం స్క్రిప్ట్‌పై వర్క్‌ చేశారు. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ‘డిక్టేటర్‌’ అనే టైటిల్‌ను అనుకొంటున్నట్లు సమాచారం. కాగా ‘లయన్‌’  చిత్ర నిర్మాత రుద్రపాటి రమణారావు ఆ చిత్రంతో కోట్లాదిరూపాయలు నష్టపోయాడట. అందుకోసం ఆయనకు నిర్మాతగా మరో సినిమా చేస్తానని బాలయ్య హామీ ఇచ్చాడని తెలుస్తోంది. బాలయ్య మరో చిత్రం చేస్తానని మాట ఇచ్చినా ఆయనతో మరో చిత్రం చేసే పరిస్థితుల్లో నిర్మాత లేడని అంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ