రోజురోజుకు ‘బాహుబలి’ క్రేజ్ ఎక్కువవతోంది. జులై 10న ఈ చిత్రం తొలిపార్ట్ విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రం రెండు పార్ట్‌లు కలిపి నిడివి 4గంటల 40నిమిషాలు వచ్చినట్లు సమాచారం. అయితే ఈ చిత్రాన్ని పలు విదేశీ భాషల్లో విడుదలకు సిద్దం చేస్తుండటంతో చైనా, హాంకాంగ్, మలేషియా, ఇంగ్లీషు భాషల్లో అనువదించనుండటంతో ఆయా విదేశీ భాషల్లో విడుదలయ్యే చోట ఈ చిత్రాన్ని బాగా ట్రిమ్ చేస్తున్నారు. పాటలు, ఇతర సెంటిమెంట్‌సీన్స్‌వంటి వాటికి కత్తెర వేస్తున్నారు. దాంతో ఈ చిత్రం మొదటిపార్ట్ నిడివి భారీగా తగ్గనుంది. ఆయా భాషల్లో ‘బాహుబలి’ మొదటిపార్ట్ కేవలం గంటన్నరే అని సమాచారం. మరి పార్ట్ 2 నిడివి ఎంతుంటుందో చూడాల్సివుంది....!