‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన హీరోయిన్ రాశిఖన్నా. ప్రస్తుతం టాలీవుడ్‌లో హీరోయిన్ల కొరత ఉండటంతో రకుల్‌ప్రీత్‌సింగ్ తర్వాత మరో చాయిస్‌గా రాశిఖన్నా పేరే వినపడుతోంది. ‘జోరు’ చిత్రం ఫ్లాప్ అయినప్పటికీ ఆమెకు ఇటీవల విడుదలైన గోపీచంద్ సినిమా ‘జిల్’ అందంపరంగా, గ్లామర్‌పరంగా, నటనాపరంగా మంచి మార్కులే తెచ్చిపెట్టింది. కాగా ప్రస్తుతం ఆమె రవితేజ సరసన ‘బెంగాల్‌టైగర్’ చిత్రంలో రెండో హీరోయిన్‌గా నటిస్తోంది. మెయిన్ హీరోయిన్‌గా తమన్నా నటిస్తోంది. తాజాగా రాశిఖన్నా ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం కుర్రహీరోల సరసన అందులోనూ మెయిన్ హీరోయిన్‌గా మాత్రమే నటించాలనే నిర్ణయాన్ని తీసుకోవడమే కాదు.. సినిమాకు 50లక్షల పారితోషికం తీసుకోవాలనే కీలక నిర్ణయం తీసుకొందిట. మరి డిమాండ్ ఉన్నప్పుడే నాలుగురాళ్లు వెనకేసుకోవాలని నిర్ణయించడం తప్పేమీ కాదని ఫిల్మ్‌నగర్ వాసులు అంటున్నారు.