పోర్న్ స్టార్‌గా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న సన్ని లియోన్ ఇప్పుడు వుండటానికి ఇల్లు లేక రోడ్డున పడిరది. లేటెస్ట్‌గా ‘కుచ్ కుచ్ లోచా హై’, ‘ఏక్ పహేలి లీలా’ చిత్రాల్లో తన అంద చందాలతో, పెర్‌ఫార్మెన్స్‌తో అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ మాజీ పోర్న్ స్టార్‌కి సంబంధించిన తాజా వార్త ఏమిటంటే ఇప్పుడు సన్ని, ఆమె భర్త డేనియల్ వెబర్ కలిసి వుంటున్న అపార్ట్‌మెంట్ నుంచి వారిని ఖాళీ చేయించారు. వారిద్దరికీ అపార్ట్‌మెంట్ ఇవ్వడానికి ఎవ్వరూ సిద్ధంగా లేకపోవడంతో ప్రస్తుతం హోటల్‌లో బస చేయాల్సి వచ్చింది. సన్ని వున్నట్టుండి అపార్ట్‌మెంట్ ఖాళీ చెయ్యడానికి రీజన్ ఏమిటంటే.. సన్ని ముంబాయికి వచ్చిన కొత్తలో ఆమెకు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి గానీ, అమ్మడానికి గానీ ఎవరూ ముందుకు రాలేదు. సన్ని పరిస్థితి చూసి చలించిపోయిన సెలీనా జైట్లీ తన స్వంత అపార్ట్‌మెంట్‌లోని పెంట్ హౌస్‌ని ఆమెకు రెంట్‌కి ఇచ్చింది. ఇలా రెండు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఓరోజు సన్ని ఇంటికి వచ్చిన సెలినా అక్కడి పరిస్థితి షాక్ అయ్యింది. సిసి కెమెరాల కోసం ఇంటిని ఎక్కడ పడితే అక్కడ డ్రిల్ చేయడమే కాకుండా ఇంటిని నీట్‌గా వుంచకపోవడంతో సీరియస్ అయి వెంటనే ఖాళీ చెయ్యమని చెప్పింది. దానికి సన్ని ఒప్పుకోకపోవడంతో లీగల్‌గా ప్రొసీడ్ అవ్వాలని డిసైడ్ అయింది. ఇక చేసేది లేక శనివారం ఆ ఇంటిని ఖాళీ చేసి హోటల్‌కి షిఫ్ట్ అయింది. తమకు ఇల్లు ఇచ్చే నాథుడి కోసం ముంబాయి అంతా గాలిస్తున్నారట.