మన తెలుగు రాష్ట్రాలు ఈ ఏడాది వేసవిలో అగ్నిగుండంలా మారాయి. దీంతో జనాలు అత్యవసరం అయితే తస్ప పగలు బయటకురావడం లేదు. దీంతో ఈ వారం విడుదలైన ‘ఎంతవాడుగానీ, మోసగాళ్లకు మోసగాడు, 365డేస్’ చిత్రాలు టాక్‌తో సంబంధం లేకుండా థియేటర్లు బోసిపోతున్నాయి. మల్టీప్లెక్స్‌లు, ఏసీ థియేటర్లు ఫర్వాలేదు. కానీ నాన్ ఏసీ థియేటర్లు, ముఖ్యంగా బి,సి సెంటర్లలోని థియేటర్లు వెలవెలబోతున్నాయి. దీంతో నిర్మాతలు, బయ్యర్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కనీస ఓపెనింగ్స్ లేకపోవడంతో ఎప్పుడు సూర్యుని ప్రతాపం తగ్గుతుందా? అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇదే విషయాన్ని త్వరలో థియేటర్లలోకి తమ సినిమాలను తేనున్న నిర్మాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. పగలు ఎండ, సాయంత్రం ఐపిఎల్ మ్యాచ్‌లతో సినీ ప్రేమికులు కాలక్షేపం చేస్తున్నారు.