ఎన్టీఆర్‌తో చేసిన టెంపర్ చిత్రం పూరి జగన్నాథ్‌కి మంచి పేరే తెచ్చింది. ఆ సినిమా తర్వాత పూరికి చాలా ఆఫర్లు వచ్చినా కొన్ని మాత్రమే చెయ్యడానికి ఒప్పుకున్నాడు. పైగా చిరంజీవి 150వ సినిమా కూడా పూరి డైరెక్షన్‌లోనే వస్తుండడంతో అతనికి మెగా ఫ్యాన్స్‌లో మరింత క్రేజ్ పెరిగింది. పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ ఎంతో డిఫరెంట్‌గా వుండడమే కాకుండా ముఖ్యంగా యూత్‌ని ఎట్రాక్ట్ చేసేలా వుంటుంది. ఈ సినిమాలోని చిరు క్యారెక్టర్ కూడా యూత్‌ని టార్గెట్ చేస్తూ డిజైన్ చేసిందేనట. చిరు క్యారెక్టర్ విషయంలో పూరి బాగా కాన్‌సన్‌ట్రేట్ చేస్తున్నారని తెలిసింది. పూరి సినిమాల్లో డైలాగ్స్‌కి వుండే స్పెషాలిటీ ఏమిటో మనకు తెలుసు. ఇప్పుడు అలాంటి డైలాగ్స్ మెగాస్టార్ చెప్తే ఎలా వుంటుందోనని మెగా ఫ్యాన్స్ థ్రిల్ అవుతున్నారు. అంతటి ఇంపార్టెన్స్ వున్న డైలాగ్స్ కోసం ప్రస్తుతం పూరి బ్యాంకాక్‌లో చాలా కష్టపడుతున్నాడు. మెగాస్టార్ 150వ సినిమా అంటే చిరుతోపాటు డైరెక్టర్‌గా పూరి జగన్నాథ్‌కి, నిర్మాతగా రామ్‌చరణ్‌కి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారింది. దీంతో ఎవరికి వారు సినిమా బాగా రావడం కోసం ఇప్పటి నుంచే అన్నిరకాల కసరత్తులు చేస్తున్నారు.