Advertisementt

మరో హర్రర్‌ సినిమాపై కన్నేసిన కళ్యాణ్‌!

Tue 26th May 2015 04:36 AM
c kalyan,chandrakala horror movie,nayanatara,maya movie,telugu dabbing,mayuri   మరో హర్రర్‌ సినిమాపై కన్నేసిన కళ్యాణ్‌!
మరో హర్రర్‌ సినిమాపై కన్నేసిన కళ్యాణ్‌!
Advertisement
Ads by CJ

రీసెంట్‌గా హన్సిక ప్రధానపాత్ర పోషించిన ‘చంద్రకళ’ను డబ్‌ చేసి లాభాల పంట పండించుకొన్న నిర్మాత సి.కళ్యాణ్‌ తాజాగా మరో హర్రర్‌ మూవీపై మనసుపారేశాడు. మరో హీరోయిన్‌ ఓరియంటెడ్‌ హర్రర్‌ చిత్రాన్ని డబ్బింగ్‌ చేయడానికి ఆయన ఉత్సాహం చూపిస్తున్నాడు. ఆ చిత్రం మరేదో కాదు... గత కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తున్న నయనతార తమిళ హర్రర్‌ మూవీ ‘మాయ’. నయనతార ఇందులో లీడ్‌ రోల్‌ పోషిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘మయూరి’ అనే టైటిల్‌తో డబ్‌ చేయడానికి ఆయన సంసిద్ధుడు అవుతున్నాడు. ఈ చిత్రం ద్వారా అశ్విన్‌ శరవణన్‌ దర్శకునిగా పరిచయం అవుతున్నాడు. ఆరి ముఖ్యపాత్రను పోషించిన ఈ చిత్రం నయనకు ‘అనామిక’ తర్వాత చేస్తున్న మరో లేడీ ఓరియంటెడ్‌ మూవీ కావడం విశేషం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ