Advertisementt

ముందు అల్లు అర్జున్‌ తర్వాతే బాలకృష్ణ.!

Tue 26th May 2015 11:49 AM
allu arjun,boyapati srinu,balakrishna 100th movie,dictator movie,allu aravind movie  ముందు అల్లు అర్జున్‌ తర్వాతే బాలకృష్ణ.!
ముందు అల్లు అర్జున్‌ తర్వాతే బాలకృష్ణ.!
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్‌’ ఎంతటి సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే.  బాలకృష్ణ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న తన 100వ సినిమాని డైరెక్ట్‌ చేసే ఛాన్స్‌ కూడా బోయపాటికే ఇచ్చిన విషయం తెలిసిందే. బాలకృష్ణ 99వ చిత్రం ‘డిక్టేటర్‌’ని లక్ష్యం ఫేమ్‌ శ్రీవాస్‌ డైరెక్ట్‌ చేస్తున్నాడు. మే 29న ఈ చిత్రం షూటింగ్‌ చాలా గ్రాండ్‌గా స్టార్ట్‌ అవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ వివరాలను ఇటీవలే ప్రకటించారు. ఈ చిత్రం కంప్లీట్‌ అయిన తర్వాత బాలకృష్ణ 100వ చిత్రానికి బోయపాటి శ్రీకారం చుట్టనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ ప్రస్తుతం జరుగుతోంది. 

ఇదిలా వుండగా, బోయపాటి డైరెక్షన్‌లో సినిమా చెయ్యాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న అల్లు అర్జున్‌ ఈ గ్యాప్‌లో ఒక సినిమా చేసెయ్యడానికి రెడీ అయ్యాడు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మించే ఈ భారీ చిత్రం జూలైలో ప్రారంభం కాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా ఫాస్ట్‌గా జరుగుతోందట. సింహా, లెజెండ్‌ చిత్రాల్లో బాలకృష్ణ క్యారెక్టర్‌ను చాలా పవర్‌ఫుల్‌గా చూపించిన బోయపాటి శ్రీను ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ను చాలా డిఫరెంట్‌గా చూపించబోతున్నాడట. ఓ కొత్త తరహా క్యారెక్టరైజేషన్‌తో బన్ని పాత్ర వుంటుందట. బన్ని, బోయపాటి ఫస్ట్‌ కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వెయిట్‌ అండ్‌ సీ.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ