ప్రస్తుతం 59 ఏళ్ల వయసులో ఉన్న చిరంజీవి ఈ ఏడాది ఆగష్టు 22తో 60వ వసంతంలోకి ఎంటర్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి దంపతులు షష్ఠి పూర్తి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని చిరు కుటుంబంతో పాటు ఆయన సంబంధీకులు, అభిమానులు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగష్టు 15నుంచి ఆగష్టు 22 దాకా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడానికి నిర్ణయించారు. అందుతున్న సమాచారం ప్రకారం షష్ఠి పూర్తి ఉత్సవాలకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం వేదిక కానుందని తెలుస్తోంది.