Advertisementt

సల్మాన్‌ కేసులో మరో సంచలనం..!!

Fri 29th May 2015 07:48 AM
salman khan,hit and run case,fire accident,rti  సల్మాన్‌ కేసులో మరో సంచలనం..!!
సల్మాన్‌ కేసులో మరో సంచలనం..!!
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ 'హిట్‌ అండ్‌ రన్‌' కేసు ఆద్యాంతం ఆసక్తికరంగా సాగుతోంది. సంఘటన జరిగిన పదేళ్ల తర్వాత ఓ సాక్షి వాంగ్మూలం మార్చడం, సెషన్స్‌ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తే.. హైకోర్టు స్టే ఇవ్వడం ఇలా ఈ సంఘటనకు సంబంధించిన ప్రతి అంశం సినీఫక్కీలో కొనసాగుతున్నాయి. ఇక తాజాగా ఈ కేసుకు సంబంధించిన కొన్ని పత్రాలు కాలిపోయాయంటూ మహారాష్ట్ర ప్రభుత్వం నివేదించడం ఆసక్తికరంగా మారింది.

2002లో ముంబైలో సల్మాన్‌ ప్రయాణిస్తున్న కారు ఓ బేకరీ ముందు ఫుట్‌పాత్‌పై పడుకున్న వారికపైకి ఎక్కడంతో ఒకరు మృతిచెందగా పలువరు గాయపడ్డారు. అయితే 2002నుంచి కూడా ఈ కేసును వాదిస్తున్న లాయర్లు, కేసు విచారణకు ప్రభుత్వం చేసిన ఖర్చు తదితర వివరాలు కావాలంటూ కొన్నాళ్ల క్రితం సమాచార హక్కు చట్టం కింద ముంబైకి చెందిన ఆర్టీఏ కార్యకర్త దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఈ కేసుకు సంబంధించిన ఎలాంటి పత్రాలు తమవద్దలేవని, 2012లో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో అవన్ని కాలిపోయాయని ప్రభుత్వం ఆర్టీఏ కార్యకర్తకు సమాధానం ఇచ్చింది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ