Advertisementt

బాలీవుడ్‌ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందా...?

Sat 30th May 2015 07:04 AM
ajay devgan,sriya sharan,drusyam hindi remake  బాలీవుడ్‌ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందా...?
బాలీవుడ్‌ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందా...?
Advertisement
Ads by CJ
మలయాళంలో మోహన్‌లాల్‌, తెలుగులో వెంకటేష్‌, తమిళంలో ఇప్పుడు కమల్‌హాసన్‌తో ‘పాపనాశం’గా రూపొందుతున్న చిత్రం ‘దృశ్యం’. ఈ చిత్రం త్వరలో బాలీవుడ్‌ ప్రేక్షకులను కూడా అలరించడానికి రెడీ అవుతోంది. ‘దృశ్యం’కు రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో అజయ్‌దేవగణ్‌ హీరో పాత్రను పోషిస్తున్నాడు. ఆయనకు జోడీగా శ్రియ నటిస్తోంది. ఇక తెలుగులో నదియా చేసిన పోలీసాఫీసర్‌ పాత్రను టబు పోషిస్తోంది. ఇప్పటివరకు యాక్షన్‌ హీరోగా అందరినీ ఆకట్టుకున్న హీరో అజయ్‌దేవగణ్‌ ఓ థ్రిల్లర్‌ చిత్రంలో నటిస్తుండటం బాలీవుడ్‌ వాసులను ఆసక్తికి గురిచేస్తోంది. నిశికాంత్‌ కామత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జులైలో విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఇటీవలే విడుదల చేశారు. ఈ పోస్టర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ