Advertisementt

మరో సంచలనానికి తెరదీస్తోన్న సి.కళ్యాణ్‌...!

Tue 02nd Jun 2015 02:19 AM
c.kalyan,ramanaarayana reddy,vivekananda reddy,rambatho lalikadu  మరో సంచలనానికి తెరదీస్తోన్న సి.కళ్యాణ్‌...!
మరో సంచలనానికి తెరదీస్తోన్న సి.కళ్యాణ్‌...!
Advertisement
Ads by CJ
నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ కాంగ్రెస్‌ ఎమ్మేల్యే, నాటి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సోదరుడు ఆనం వివేకానందరెడ్డి ఎప్పూడూ ఏదో ఒక వింత చేష్టలతో, ప్రవర్తనతో వార్తల్లో ఉండే విషయం తెలిసిందే. కాగా సినీ నిర్మాత అయిన మరో నెల్లూరీయుడు సి.కళ్యాణ్‌ కూడా ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో అందరి నోట్లో నానుతుంటాడు. అయితే వీరిద్దరికి ఇటీవల కోట్లు విలువ చేసే ఓ స్థలం విషయంలో వివాదం రేగింది. దీంతో నిర్మాత సి.కళ్యాణ్‌ తాజాగా వివేకా గుట్టు విప్పుతానంటూ ఆయన చేసిన పనులపై సెటైర్లు వేస్తూ ‘రంభతో లాలికాడు’ అనే చిత్రాన్ని తీయడానికి సంసిద్దుడు అవుతున్నాడు. ఈ విషయాన్ని ఆయన నెల్లూరు వచ్చిన సందర్భంగా తెలియజేశాడు. మొత్తానికి ఇలాంటి చిత్రాలు మనకు కొత్తేమీ కాకపోయినా నెల్లూరు వాసులకు మాత్రం ఆనంపై సినిమా తీస్తుండటం, అందునా సి.కళ్యాణ్‌ నిర్మిస్తుండటం కాస్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ