Advertisementt

తొలి సినిమాకే యుద్దం చేయనున్న అక్కినేని అఖిల్‌..!

Tue 02nd Jun 2015 03:04 AM
akhil akkineni,v.v.vinayak,raviteja,bengal tiger,ramcharan  తొలి సినిమాకే యుద్దం చేయనున్న అక్కినేని అఖిల్‌..!
తొలి సినిమాకే యుద్దం చేయనున్న అక్కినేని అఖిల్‌..!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం అక్కినేని అఖిల్‌ సోలో హీరోగా తెరంగేట్రం చేస్తూ మాస్‌ చిత్రాల దర్శకుడు వినాయక్‌ దర్శకత్వంలో నితిన్‌ నిర్మాణ సంస్థలో తొలి చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని మొదట్లో ఆగష్టులో విడుదల చేయాలని భావించారు. ఆగష్టులో అయితేనే అఖిల్‌కు హ్యాపీగా ఉండేది. కానీ షూటింగ్‌ ఆలస్యమవుతుండటంతో ఈ చిత్రాన్ని వినాయక చవితి కానుకగా విడుదల చేయాలా? లేక దసరా కానుకగా విడుదల చేయాలా? అనే సందిగ్ధంలో యూనిట్‌ ఉంది. వినాయక చవితికి వద్దామంటే ఇప్పటికే మాస్‌మహారాజా రవితేజ ‘బెంగాల్‌టైగర్‌’కు కర్చీఫ్‌ వేసిఉన్నాడు. పోనీ దసరా కానుకగా వద్దామంటే రామ్‌చరణ్‌`శ్రీనువైట్లల చిత్రం దసరా కానుకగా అక్టోబర్‌ 15న విడుదల కానుంది. దీంతో ఎలాగూ అఖిల్‌కు పోటీ తప్పేట్లు లేదు. మొత్తానికి దసరానే ఈ యూనిట్‌ టార్గెట్‌ చేసినట్లు సమాచారం. రామ్‌చరణ్‌ చిత్రానికి ఒకటి రెండు వారాల గ్యాప్‌ తీసుకొని అఖిల్‌ మొదటి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ